రాయికల్: ఇటిక్యాల అంగన్వాడీ కేంద్రాల్లో ఘనంగా అంగన్ మిలన్ సేవ: పాల్గొన్న డాక్టర్ బోగ శ్రావణి
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా రాయికల్ మండలం ఇటిక్యాలలో 'అంగన్ మిలన్ సేవ' నిర్వహించారు. బీజేపీ జగిత్యాల ఇంచార్జ్ డాక్టర్ బోగ శ్రావణి అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పిల్లలకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. సిబ్బందిని సత్కరించి, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.