రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో విద్యుత్ స్తంభానికి ఢీకొట్టిన ఆటో తప్పిన పెను ప్రమాదం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయిబాబా కమాన్ వద్ద ప్రధాన రహదారిపై విద్యుత్ స్తంభానికి ఒక గూడ్స్ ఆటో ఢీకొట్టడంతో విద్యుత్ స్తంభం విరిగి ఆటో పై పడింది. చుట్టుపక్కల ఉన్నవారు అప్రమత్తతతో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదు. వెంటనే సెస్ అధికారులు స్పందించి విద్యుత్ నిలిపివేసి మరమ్మత్తులు చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.