ఉదయగిరిలో చారిత్రక ఆనవాళ్లపై చెట్లు మొలవడం తో పురావస్తు శాఖ ఉద్యోగులు స్పందించారు. శనివారం ఆలయ ప్రాకారాలు, పలు నిర్మాణాలు, గాలిగోపురం, గర్భగుడి, ముఖద్వారంపై మొలిచిన పిచ్చి మొక్కలు, చెట్లను తొలగించారు. అనంతరం అవి తిరిగి పెరగకుండా కెమికల్స్ చల్లారు. దీంతో పట్టణవాసులు సిబ్బందికి అభినందనలు తెలిపారు.