నల్లగుట్ట పల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండల పరిధిలోని నల్లగుట్టపల్లి సమీపంలో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంలో వెంకటరమణ అనే వ్యక్తి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా స్థానికులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని వందేమాతరం టీం సభ్యులు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ ద్వారా తరలించారు.