దుబాయ్ లో మరణించిన వాల్గొండ తాండా వాసి మల్లాపూర్ మండలంలోని వాల్గొండ తాండాకు చెందిన లఖావత్ రమేష్ దుబాయిలోని షార్జాలో మరణించారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు సుఖీభవ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బొక్కెనపల్లి నాగరాజ్, రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీం రెడ్డి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్గనైజేషన్ సభ్యులు పాల్గొన్నారు.