జుక్కల్: జుక్కల్లో 8వ రోజుకు చేరిన ఎన్హెచ్ఎం సిబ్బంది సమ్మె
కామారెడ్డి జిల్లా జుక్కల్లో ఎన్హెచ్ఎం సిబ్బంది 8 రోజులుగా సమ్మె చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం, వార్షిక వేతన పెంపు, ఆరోగ్య బీమా సౌకర్యాల కోసం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు వినతిపత్రం సమర్పించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.