గద్వాల్: గద్వాల రేపల్లె గ్రామంలో ఘనంగా పౌరహక్కుల దినోత్సవం
జోగులాంబ గద్వాల జిల్లా రేపల్లె గ్రామంలో నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవంలో అధికారులు పాల్గొన్నారు. కుల వివక్ష, అంటరానితనం నేరమని, అందరూ కలిసిమెలిసి ఉండాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బి.కురుమన్న, ఎస్సై శ్రీకాంత్, అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.