మార్కాపురం: జిల్లా కేంద్రంలో త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్న రైతు బజార్
మార్కాపురం జిల్లా కేంద్రంలోని తర్లుపాడు రోడ్డు పెద్ద నీళ్ల ట్యాంక్ ఆవరణంలో రైతు బజార్ ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చర్యలు చేపట్టారు. అందులో భాగంగా జిల్లా మున్సిపల్ ఇంజనీరు అధికారులు పనులను ప్రారంభించేందుకు కొలతలు వేశారు. త్వరలో రైతు బజార్ శంకుస్థాపనకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు రైతు బజార్ అందుబాటులోకి రానున్నది.