జగిత్యాల: జగిత్యాలలో విచిత్రం: పోలీస్ వాహనం నంబరుతో తిరుగుతున్న ప్రైవేట్ కారు!
జగిత్యాల పట్టణంలో పోలీస్ వాహనం నంబరుతో ప్రైవేట్ స్విఫ్ట్ కారు తిరుగుతోంది. ఆ కారుపై 'POLICE' బోర్డు ఉండటం గమనార్హం. 2020లో జరిగిన ఓవర్ స్పీడ్ చలాన్లో కూడా ఇదే నంబర్ నమోదైంది. ఈ వ్యవహారంపై అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది.