ఒంగోలు అర్బన్: పోలీస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంకు 86 ఫిర్యాదులు
Ongole Urban, Prakasam | Sep 21, 2026
ఫిర్యాదిదారుల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం ప్రకాశం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో “మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) యుగంధర్ బాబు మరియు పోలీస్ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదిదారులతో పోలీస్ అధికారులు ముఖాముఖిగా మాట్లాడి, వారి సమస్యలను విని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఉద్యోగ సంబంధిత / ఆన్లైన్ మోసాలు, భూ వివాదాలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించారు