దేవరకొండ: దేవరకొండలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే బాలు నాయక్
దేవరకొండ నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనపై ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ సమీక్ష నిర్వహించారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల అధికారులతో సమావేశమై పెండింగ్లో ఉన్న పనులు, కొత్తగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు.