జలదంకి మండలంలోని తొమ్మిదవ మైలు సెంటర్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తరాఖండ్కు చెందిన వ్యవసాయ కూలీ రామ్ రాయ్ మృతి చెందారు. వరి నాట్లు వేసేందుకు వచ్చిన ఈ కూలీని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.