రాయదుర్గం: ప్లాట్ ఫాం నిర్మాణం పూర్తి కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైలు ప్రయాణికులు
రాయదుర్గం పట్టణంలోని రైల్వే స్టేషన్ లో రైల్వే ప్లాట్ ఫాం 2 నిర్మాణం పూర్తి కాకపోవడంతో రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఫ్లాట్ ఫాం - 2 ద్వారా తిరుపతి - కదరిదేవరపల్లి రైలు రాకపోకలు సాగిస్తుంది. ప్రయాణికులు రైలు ఎక్కాలంటే ఇదే ప్లాట్ ఫాం ద్వారా నే రైలు ఎక్కి దిగాల్సి ఉంటుంది. పనులు అర్దాంతరంగా ఆగిపోయిన కారణంగా వృద్ధులు, మహిళలు, చిన్నారుల రైలు ఎక్కి దిగేందుకు నరకయాతన అనుభవిస్తున్నారు. రైల్వే అధికారులు ఇప్పటికైన ప్లాట్ ఫాం నిర్మాణం పూర్తి చేసి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.