కర్నూలు: వైసీపీ కార్యకర్తలపై దాడులు, పోలీసుల ఒత్తిడి: మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
కర్నూలులో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆరోపించారు. కూటమి పాలనలో నిత్యావసర ధరలు పెరిగాయని, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేదని ఆయన విమర్శించారు. ఓటమి భయంతోనే దాడులకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.