ఏటూరునాగారం: చల్వాయి గ్రామంలో గ్రంథాలయం, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో గ్రంథాలయం, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని ఆర్టీఐ కమిటీ మెంబర్ పసులాది ముఖేష్ జిల్లా కలెక్టర్‌ను కోరారు. విద్యార్థులు, యువత ప్రయోజనాల కోసం ప్రభుత్వ స్థలంలో ఈ సదుపాయాలను కల్పించాలని వినతిపత్రం సమర్పించారు.