మార్కాపురం: జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ విగ్రహానికి ఘన నివాళులర్పించిన కలెక్టర్ విజయ సునీత
గాంధీ అడుగుజాడల్లో నడవడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని జిల్లా కలెక్టర్ విజయ సునీత అన్నారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ పార్కులో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ... గాంధీ చూపిన సత్యం అహింస శాంతి మార్గాలు సర్వదా సర్వత్రా అనుసరణీయమని అన్నారు. బాపు కలలుగన్న గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా గ్రామ స్వరాజ్యం సాకారమవుతుందన్నారు. కార్యక్రమంలో జెసి శ్రీనివాసులు జిల్లా అధికారులు పాల్గొన్నారు.