బనగానపల్లె: కొలిమిగుండ్ల ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉధృత వాతావరణం
కొలిమిగుండ్ల ఎంపీడీవో కార్యాలయంలోని నామినేషన్ కేంద్రం వద్ద శుక్రవారం చివరి నిమిషంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. నామినేషన్ వేయడానికి వచ్చిన వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారంటూ టీడీపీ శ్రేణులు దాడికి యత్నించారు. దీంతో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీఐ రమేశ్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.