రెండు సార్లు డీసీసీగా పని చేసిన వారికి కాంగ్రెస్ అధిస్థానం అవకాశం కల్పించలేదని,దాని ప్రకారమే ASF డీసీసీ పదవి కొత్త వారికి ఇవ్వడం జరిగిందని ASF మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 36 జిల్లాలో కొత్త వారికి అవకాశం ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు నాతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు,నాయకులు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేశారని పేర్కొన్నారు.