రాయదుర్గం: ఆకట్టుకుంటోన్న యల్లమ్మ కొండపై పట్టాభి సీతారామ స్వామి ఆలయం డ్రోన్ విజువల్
రాయదుర్గం పట్టణంలోని యల్లమ్మ కొండపై పట్టాభి సీతారామ స్వామి ఆలయం డ్రోన్ విజువల్ ఆకట్టుకుంటోంది. శ్రీరామ నవమి సందర్భంగా వేలాది మంది భక్తులు కాలినడకన కొండపైకి చేరుకుని సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. చుట్టూ కొండల మద్య ఆలయం ఉంది. సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయ, భరత, శత్రుజ్ఞుల విగ్రహాలు కలసి ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. ప్రతీ ఏడూ శ్రీరామ నవమి వేడుకలకు వేలాది మంది భక్తులు తరలిరావడం విశేషంగా చెప్పుకోవచ్చు.