మార్కాపురం: తర్లుపాడు మండల రైతులకు పలు సూచనలు చేసిన మండల వ్యవసాయ అధికారి జోష్నా దేవి
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలోని రైతులకు మండల వ్యవసాయ అధికారి జోష్నా దేవి పలు సూచనలు చేశారు. పిఎం ఫసల్ బీమా యోజన ఆగస్టు 15వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు. పంటలు సాగు చేసిన రైతులు సమీప మీసేవ కేంద్రాలు, బ్యాంకులలో బీమా చేసుకోవాలని కోరారు. సందేహాలకు సమీప వ్యవసాయ శాఖ సిబ్బందిని సంప్రదించాలన్నారు. మండలంలోని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు