బిజినేపల్లి: నంది వడ్డేమాన్లో ఆసరా పింఛన్ల పంపిణీపై కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ఆరా
బిజినపల్లి మండలం నంది వడ్డేమాన్ పోస్టాఫీసును జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సందర్శించారు. పింఛన్ల పంపిణీ తీరును లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.