ఒంగోలు అర్బన్: బీసీలకు 34% రిజర్వేషన్లు – సామాజిక న్యాయానికి చారిత్రాత్మక అడుగు-ఒంగోలు తెలుగుదేశం పార్టీ నాయకులు.
Ongole Urban, Prakasam | Aug 20, 2026
ఒంగోలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు బీసీ నాయకులు గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాజిక న్యాయం, సమాన అవకాశాల సాధనలో కీలకమైన ముందడుగు. బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా వారి అభివృద్ధి, సాధికారతకు మరింత బలం చేకూరనుంది తెలిపారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచీ బీసీల సంక్షేమం, అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.