నంద్యాల అర్బన్: అవయవదానంతో మరొకరికి పునర్జన్మనిచ్చిన నంద్యాల జిల్లా వాసి
Nandyal Urban, Nandyal | Oct 3, 2026
నంద్యాలజిల్లా గోస్పాడు మండలం కానాలపల్లెకు చెందిన రమణమ్మ(36) గత నెల 30న కూలీ పనులకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. నంద్యాల ప్రభుత్వాస్పత్రి వైద్యులు బ్రెయిన్‌డెడ్ గా నిర్ధారించారు. కుటుంబీకులు అవయవదానానికి అంగీకరించడంతో ఒక కిడ్నీని కర్నూలు మెడికోవర్, లివర్‌ను గౌరీ గోపాల్, మరో కిడ్నీని నెల్లూరు కిమ్స్ ఆస్పత్రులకు తరలించారు. లివర్‌ను వరంగల్‌కు చెందిన హజ్రత్ (51)కు అమర్చారు