ఒంగోలు అర్బన్: రోడ్డు సేఫ్టీ టీమ్ డెమోను విజయవంతంగా నిర్వహించిన వివిధ శాఖల, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసిన జిల్లా ఎస్పీ
.
Ongole Urban, Prakasam | Aug 19, 2026
ఆగస్టు 15న నిర్వహించిన రోడ్డు సేఫ్టీ టీమ్ డెమోలో సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బంది, 108 సిబ్బంది, ఆర్టీఏ అధికారులు, నేషనల్ హైవే సిబ్బంది & అంబులెన్సు, అగ్నిమాపక శాఖ అధికారులు మరియు సిబ్బందిని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు వివిధ శాఖలు సమన్వయంతో వేగంగా స్పందించి బాధితులకు తక్షణ సహాయం అందించడంతో పాటు, ప్రమాదాలకు కారణమయ్యే అంశాలను గుర్తించి భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టే లక్ష్యంతో 4E ముఖ్యం అన్నారు