గద్వాల్: గోనుపాడులో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల మండలం గోనుపాడు గ్రామంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. లబ్ధిదారులకు కానుకలను అందజేసి గృహప్రవేశ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.