కరీంనగర్: ఎల్నినో ఎఫెక్ట్: తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారుల ఆదేశం
ఎల్నినో నేపథ్యంలో జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులకు సూచించారు. నీటి వృథాను అరికట్టి, ప్రణాళికాబద్ధంగా తాగునీటిని సరఫరా చేయాలని ఆమె ఆదేశించారు.