వికారాబాద్: జిల్లాలో ధరణి భూ సమస్యలపై నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచన
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ధరణి భూ సమస్యలపై నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్‌ను రైతులు సద్వినిగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి శనివారం తెలిపారు. ధరణి డ్రైవ్‌పై రెవెన్యూ అధికారులతో టెలీ కాన్ఫెరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని గ్రామాలలో ధరణిలో ఏర్పడిన సమస్యలను పరిష్కరించే దిశగా, అధికారులకు కృషి చేయాలన్నారు. మార్చి 9 వరకు జరిగే ధరణి స్పెషల్ డ్రైవ్ తేదీల వారిగా అధికారులు గ్రామాల్లో పర్యటించడం జరుగుతుందని ఆయన తెలిపారు.