సూర్యాపేట: సూర్యాపేటలో అక్టోబర్ 1 నుంచి వరి కొనుగోళ్లు.. 300కు పైగా కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు!
సూర్యాపేట జిల్లా రైతుల కోసం కీలక సమాచారం. అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో సుమారు 300కు పైగా కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వరి కోతలు ప్రారంభం కానుండటంతో అధికారులు సన్నద్ధమవుతున్నారు.