పిఠాపురం: సామర్లకోటలో ఎంపీటీసీ నామినేషన్ల సందడి: ఎమ్మెల్యే ఎన్నికల తరహాలో భారీగా తరలివచ్చిన అభ్యర్థులు
సామర్లకోట మండల పరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ఉత్సాహంగా సాగింది. పెద్ద సంఖ్యలో వాహనాలతో అభ్యర్థులు తరలిరావడంతో కార్యాలయం వద్ద సందడి నెలకొంది. సీఐ కృష్ణ భగవాన్ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.