తమ డిమాండ్లను నెరవేర్చాలని ఆత్మకూరు ఆర్టీసీ డిపో ఎదురుగా మంగళవారం మధ్యాహ్నం అంగన్వాడి వర్కర్స్ నిరసన చేపట్టారు.సిఐటియు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున అంగన్వాడి వర్కర్లు బస్టాండ్ ముందర చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అంగన్వాడీలకు ఫ్రీ సిలిండర్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.గత ప్రభుత్వంలో 42 రోజుల సమ్మెకు మద్దతు ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.