శ్రీశైలం: ఆత్మకూరు ముగిసిననామినేషన్లు వార్డుకు 202 నామినేషన్లు.. చైర్పర్సన్కు 10 మంది పోటీ
నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల వివరాలను మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో గత మూడు రోజులుగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నామినేషన్ల స్వీకరణ పూర్తయిందని తెలిపారు. ఇప్పటివరకు మున్సిపల్ వార్డు సభ్యుల స్థానాలకు మొత్తం 202 నామినేషన్లు దాఖలవగా, చైర్పర్సన్ పదవికి 10 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. చైర్పర్సన్ అభ్యర్థుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఐదుగురు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఐదుగురు నామినేషన్లు దాఖలు చేశారు.