ఉదయగిరి ఏబీఎం కాంపౌండ్ గ్రౌండ్లో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వయసు సుమారు 60 సంవత్సరాలు అని తెలుస్తుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఉదయగిరి ఎస్సై ఇంద్రసేనారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు