శ్రీశైలం: రబీలో మెట్ట పంటల సాగుపై కిసాన్ గోష్టి కార్యక్రమం. పాల్గొన్న ఉమ్మడి జిల్లా వ్యవసాయ అధికారులు
ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రబీ సీజన్లో తక్కువ నీటితో సాగుచేసే మెట్ట పంటలను ఎంచుకోవడం ద్వారా మంచి దిగుబడులను సాధించవచ్చునని *జిల్లా వనరుల కేంద్రం, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ చెన్నయ్య రైతులకు వివరించారు. నంద్యాల వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మోహన్ విష్ణువర్ధన్ వివిధ పంటలలో ఎల్ నినో పరిస్థితులలో పాటించవలసిన సమగ్ర యాజమాన్య పద్ధతులపై వివరించారు. అలాగే శాస్త్రవేత్త అరుణ్ కుమార్ మాట్లాడుతూ వర్షభావ పరిస్థితులను ముందుగానే అంచనా వేసుకుని రైతులు పంటల ఎంపిక చేసుకోవాలని, అలాగే సాగు విధానంలో తగిన మార్పులుచేసుకోవాలని్నారు