వనపర్తి: వనపర్తిలో ఏబీసీ కేంద్రం, డంపింగ్ యార్డ్ తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
వనపర్తి మండలం నాగవరం శివారులోని జంతు జనన నియంత్రణ కేంద్రం, డంపింగ్ యార్డ్‌లను అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ బుధవారం పరిశీలించారు. సుప్రీంకోర్టు నిబంధనల అమలుతో పాటు, డంపింగ్ యార్డ్‌లో అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.