గుంతకల్లు: గుత్తిలో అకాల వర్షానికి భారీ నష్టం, నేల కూలీల చెట్లు, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ సరఫరాకు అంతరాయం
గుత్తిలో మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులకు తోడు ఈదురు గాలులు వీచాయి. షామియానాలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఫ్లెక్సీలు, విద్యుత్ వైర్లు నేలకూలాయి. ఆరు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.జనాలు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం పై అకాల వర్షం అపార నష్టాన్ని కలగజేసింది.