ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు ఎంపీటీసీ అభ్యర్థులకు అలర్ట్: నిర్భయంగా నామినేషన్లు వేయండి
ఎమ్మిగనూరులో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోందని రూరల్ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. అనివార్య కారణాల వల్ల నామినేషన్ వేయలేని అభ్యర్థులు, ఈరోజు మధ్యాహ్నం లోపు ఎటువంటి భయం లేకుండా నామినేషన్లు వేసుకోవచ్చని ఆయన సూచించారు. పోలీసుల సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.