ఒంగోలు అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికలకు ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయాలని ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్
Ongole Urban, Prakasam | Aug 19, 2026
స్థానిక సంస్థల ఎన్నికలకు ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర సచివాలయం నుంచి బుధవారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు .స్థానిక సంస్థల ఎన్నికలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల ఆధారంగా రిజర్వేషన్ సీట్లను నిర్ణయించాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల సర్వే సమర్థంగా పూర్తి చేయాలన్నారు. తదుపరి సీట్లను నిర్ధారించాలన్నారు. ఎన్నికల సామగ్రి కొనుగోలు చేపట్టాలన్నారు. రాష్ట్రం నుంచి ఎన్నికల సామాగ్రి కేటాయింపు ఉంటుందని, మిగతావి స్థానికంగా కొనుగోలు చేసుకోవాలన్నా