భీమిలి: మధురవాడ జోన్ 2 వద్ద మున్సిపల్ కార్మికుల భారీ ధర్నా: జీతాల పెంపు కోసం నిరసన
మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మధురవాడ జోన్ 2 కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఇన్కమ్ టాక్స్ డబ్బులు వాపసు చేయాలని, హామీలు అమలు చేయాలని కోరుతూ సూపరింటెండెంట్‌కు వినతి పత్రం అందజేశారు.