పూతలపట్టు: ముగిసిన ఎగుమత్యం ముత్తుకూరు మహాభారత ఉత్సవాలు
తవణంపల్లి మండలం ఎగుమత్యం ముత్తుకూరులోని ద్రౌపతీ సమేత ధర్మరాజుల దేవస్థానంలో మహాభారత ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు దుర్యోధన వధ, అగ్నిగుండ ప్రవేశం, ధర్మరాజు పట్టాభిషేకం మరియు అన్నదానం జరిగాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.