పుంగనూరు: సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పేరుతో ప్రజాధనం వృథా: ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి
పుంగనూరులో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత పాలకులు చెరువులో మరో చెరువు కట్టి ప్రజాధనాన్ని వృథా చేశారని ఆరోపించారు. కరువు సమయంలో పడమటి మండలాలకు హంద్రీ-నీవా జలాలను అందించి, ప్రజలకు నీటి ఇబ్బందులు లేకుండా చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆయన స్పష్టం చేశారు.