రాయదుర్గం: బొమ్మనహాల్ లో పెన్షన్ లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్
బొమ్మనహాల్ మండల కేంద్రంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పెన్షన్లను పంపిణీ చేశారు. బుధవారం ఉదయం గ్రామానికి చేరుకుని నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లారు. పెన్షన్ నగదు అందజేశారు. నెల నెలా పెన్షన్ లు సక్రమంగా అందుతున్నాయా అంటూ వారితో ఆరా తీశారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపిడిఓ, పలువురు స్థానిక అధికారులు పాల్గొన్నారు.