మంచిర్యాల: మంచిర్యాల బస్టాండ్లో పెరిగిన నిఘా: కొత్తగా 10 సీసీ కెమెరాల ఏర్పాటు
మంచిర్యాల బస్టాండ్లో భద్రతను మెరుగుపరిచేందుకు తాజాగా 10 కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం కెమెరాల సంఖ్య 16కు చేరింది. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కెమెరాలను బిగించినట్లు పోలీసులు తెలిపారు.