వరికుంటపాడు కూడలిలో హైవేపై ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ వెలగక మూడున్నర ఏళ్లుగా అంధకారం నెలకొంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్పంచి కొండిపోగు దిలీప్ కుమార్ రహదారి మెయింటెనెన్స్ వారిపై ఒత్తిడి తీసుకురావడంతో వారు మరమ్మతులు చేపట్టారు. వరికుంటపాడు కూడలిలో శుక్రవారం రాత్రి ఎట్టకేలకు డివైడర్ మధ్యలో ఉన్న లైట్లను వెలిగించారు. దీంతో ఇబ్బందులు తొలిగాయి.