నందికోట్కూరు: వడ్డేమాన్ గ్రామంలో బ్రాహ్మణకొట్కూరు ఎస్సై ఆధ్వర్యంలో పోలీసుల సోదాలు
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని వడ్డేమాన్ గ్రామంలో ఆదివారం కార్డెన్ సర్చ్ నిర్వహించినట్లు బ్రాహ్మణ కొట్కూరు ఎస్సై మణికంఠ తెలిపారు, గ్రామంలో ఎవరైనా అనుమానదాస్పద వ్యక్తులు ప్రవేశించినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని గ్రామ ప్రజలకు సూచించారు, అదేవిధంగా ఎవరైనా అక్రమ ఆయుధాలు, అక్రమ మద్యం, కల్తీ నాటు సారా కలిగిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు