జలదంకి మండలం, గట్టుపల్లి చింతలపాలెం లో బుధవారం హత్యకు గురైన టిడిపి నేత ప్రసాద్ నాయుడు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గురువారం కావలి ఏరియా వైద్యశాల వద్ద పరామర్శించారు. ప్రసాద్ నాయుడు మృతదేహం కావలి ఏరియా వైద్యశాల మార్చరీలో ఉండగా మృతదేహాన్ని సందర్శించి అనంతరం ఘటన జరిగిన ప్రాంతంలో పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు . నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఆయన పోలీస్ అధికారులకు ఆదేశించారు.