శ్రీశైలం: మహానంది ఆలయ రాజగోపురం వద్ద నాగుపాము కలకలం. బంధించి అడవిలో వదిలిన స్నేక్ క్యాచర్ మోహన్
మహానందిలోని ప్రధాన రాజగోపురం నుంచి లోపలికి వెళ్లే మార్గంలో నాగుపాము కలకలం రేపింది. భక్తులు దర్శనం కోసం వెళ్తుండగా రాజగోపురం నుంచి అమ్మవారి విగ్రహం వైపు పాము వెళ్లడం గమనించిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. స్థానిక ఆలయ సిబ్బంది వెంటనే స్నేక్ క్యాచర్ మోహన్‌కు సమాచారం అందించారు. మోహన్ అక్కడే ఉండడంతో వెంటనే వచ్చి పామును పట్టుకొని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశాడు. ఆలయానికి సమీపంలో అటవీ ప్రాంతం ఉండడంతో సరస్సు పాములు ఆలయంలో సంచరిస్తున్నడంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు