మార్కాపురం: పట్టణ పోలీస్ స్టేషన్లో ఇప్పటివరకు 19 చోరీ కేసులు నమోదు కాగా 13 కేసులను చేదించినట్లు తెలిపిన సీఐ ఆల్తాఫ్ హుస్సేన్
మార్కాపురం జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్లో 2026 మే నెల నుండి ఇప్పటి వరకు 19 చోరీ కేసులు నమోదయినట్లు సిఐ అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. అందులో 11 మోటార్ సైకిల్ చోరీ కేసులు 8 బంగారు వెండి ఆభరణాల సూరి కేసులు నమోదు చేయబడ్డాయి అన్నారు. ఇప్పటివరకు ఎనిమిది మోటార్ సైకిల్ 5 బంగారు వెండి ఆభరణాల కేసులను ఛేదించామన్నారు. రికవరీ చేసిన సొత్తును చట్ట ప్రకారం కోర్టు ఆదేశాల మేరకు సంబంధిత బాధితులకు అప్పగించడం జరుగుతుందన్నారు.