బనగానపల్లె: అన్నదాతలను ఆదుకుంటాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
జిల్లాలో ఎల్నినో ప్రభావంతో నష్టపోయిన అన్నదాతలను ఆదుకుంటామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో రైతులకు సబ్సిడీ శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రబీ సీజన్ కోసం రైతులకు సకాలంలో విత్తనాలను ఏర్పాటు చేశామని, రైతులు విత్తనాలు, ఎరువులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.