బెజ్జంకి: బెజ్జంకి వద్ద రాజీవ్ రహదారిపై బోల్తా పడిన లారీ.. ట్రాఫిక్ జామ్
బెజ్జంకి మండలం పోతారం క్రాస్ రోడ్డు వద్ద రాజీవ్ రహదారిపై కోడిపిల్లలతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం కలగగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.