వనపర్తి: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కమిషనర్ సమీక్ష: కీలక ఆదేశాలు జారీ
జిల్లాలో వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై కమిషనర్ సమీక్ష జరిపారు. మాతా శిశు ఆరోగ్యం, వ్యాధుల నియంత్రణ, 30 ఏళ్లు దాటిన వారికి పరీక్షలపై దిశానిర్దేశం చేశారు. ఈ నెల 16 నుంచి ఉద్యోగుల హాజరును ఈ-ప్రమాణ్ యాప్లో నమోదు చేయాలని ఆదేశించారు. డీఎంహెచ్ఓ భాస్కర్ నాయక్ పాల్గొన్నారు.